21, అక్టోబర్ 2021, గురువారం

బాగుంటుంది నువ్వు నవ్వితే పాట లిరిక్స్ - Baguntundhi Nuvvu Navvithe Song Lyrics in Telugu - Athidhi Devobhava (2021) Telugu Songs Lyrics








చిత్రం : అతిధి దేవోభవ (2021)

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్

సంగీతం : శేఖర్ చంద్ర

గానం : సిద్ శ్రీరామ్, నూతన మోహన్



బాగుంటుంది నువ్వు నవ్వితే 

బాగుంటుంది ఊసులాడితే 

బాగుంటుంది గుండె మీద 

గువ్వలాగ నువ్వు వాలితే 


బాగుంటుంది నిన్ను తాకితే 

బాగుంటుంది నువ్వు ఆపితే 

బాగుంటుంది కంటికున్న కాటుకంత

వొంటికంటితే 


ఆ అహ హా హ 

బాగుంది వరస 

నీ మీద కోపం ఎంతుందో తెలుసా 

లాలిస్తే తగ్గిపోతుంది బహుశా 

ఈ మనసు ప్రేమ బానిస 


ఐతే బుజ్జగించుకుంటానే 

నిన్నే నెత్తినెట్టుకుంటానే 

నువ్వే చెప్పినట్టువింటానే 

చెలి చెలి జాలిచూపవే 


తడి చేసేద్దాం పెదవులని 

ముడివేసేద్దాం మనసులని 

దాచేసుకుందాం మాటలని 

దోచేసుకుందాం హాయిని 


కాదంటనేంటి చూస్తూ నీ చొరవ

వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ 

నీ నుంచి నే తప్పుకోవడం సులువా 

కౌగిళ్ళలోకి లాగవా 


ఆమ్మో నువ్వు గడుసు కదా 

అన్ని నీకు తెలుసు కదా 

అయినా బైట పడవు కదా 

పదా పదా ఎంతసేపిలా 


వెలివేసేద్దాం వెలుతురుని 

పరిపాలిద్దాం చీకటిని 

మ్మ్ మ్మ్  పట్టించుకుందాం చెమటలని 

చుట్టేసుకుందాం ప్రేమని 


నువ్వేమో పెడుతుంటే తొందరలు 

నాలోన సిగ్గు చిందరవందరలు 

అందంగా సర్దుతూ నా ముంగురులు 

మోసావు అన్ని దారులు 


కొంచెం వదిలానంటే నిన్నిలా 

మొత్తం జారిపోవా వెన్నెలా 

వేరే దారి లేక నేనిలా 

బందించానే అన్ని వైపులా 


బాగుంటుంది నువ్వు నవ్వితే 

బాగుంటుంది ఊసులాడితే 

బాగుంటుంది గుండె మీద 

గువ్వలాగ నువ్వు వాలితే 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి