25, అక్టోబర్ 2021, సోమవారం

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా పాట లిరిక్స్ - Ninnenaa Nenu Choosthondi Ninnenaa Telugu Song Lyrics - Salute (2008) Telugu Songs Lyrics









చిత్రం : శాల్యూట్ (2008)

సంగీతం : హ్యారీస్ జయరాజ్     

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : బెన్నీ దయాళ్, సాధనా సర్గమ్  


 

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా

రూపంలో చుక్కల దండలా

నవ్వుల్లో చిలకమ్మలా

చిన్నారుల చేతికి బొమ్మలా

 

ఇంతకీ నువ్వొకడివా వందవా

ఎంతకీ నువ్వెవరికీ అందవా !

కొత్తగా లవ్ లో పడుతుంటే.. 

కొద్దిగా ఇదిలా ఉంటుంది

ముందుగా మనసుకి తెలిసుందే

ముందుకే నెడుతూ ఉంటుందే

తప్పుకాబోలనుకుంటూనే 

తప్పుకోలేననుకుంటుందే

నొప్పిలో తీపి కలుస్తుందే 

రెప్పలో రేపు కురుస్తుందే

 

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా

రూపంలో చుక్కల దండలా

నవ్వుల్లో చిలకమ్మలా

చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్వొకడివా వందవా

ఎంతకీ నువ్వెవరికీ అందవా !

 

తడవక నడిపే గొడుగనుకోనా

అడుగుల సడిలో పిడుగైనా

మగతను పెంచే మగతనమున్నా

మునివనిపించే బిగువేనా

ముళ్ళలా నీ కళ్ళలా నను గిల్లిపోతున్నవా

పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా

నాకేమౌతావో చెప్పవ ఇపుడైనా !

 

చెప్పమని అడిగేం లాభంలే 

ఎప్పుడో పొందిన ఆన్సర్లే

ఉత్తినే వేసే కొచ్చిన్లే 

ఊరికే తీసే ఆరాలే

నిదర చెడగొట్టే నేరాలై 

కుదురుగా ఉంచని తొందరలే

దరిమిలా అంతా నీవల్లే 

అంటు నిలదీసే నిందల్లే

 

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

 

బిత్తరపోయే బెదురొదిలించూ

కొత్తగ తెగువే కలిగించూ

కత్తెర పదునై బిడియము తెంచూ

అత్తరు సుడివై నను ముంచూ

చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ

చెమట పుట్టే పరుగు పెట్టీ హద్దులే కరగనీ

అని అడగాలన్నా అడిగెయ్ లేకున్నా !

 

చెప్పమని అడిగేం లాభంలే 

ఎప్పుడో పొందిన ఆన్సర్లే

ఉత్తినే వేసే కొచ్చిన్లే 

ఊరికే తీసే ఆరాలే

నిదర చెడగొట్టే నేరాలే

కుదురుగా ఉంచని తొందరలే

దరిమిలా అంతా నీవల్లే 

అంటు నిలదీసే నిందల్లే

 

హో.. నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా

నువ్వేనా నువ్వు లా ఉన్న ఎవరోనా

కోపంలో నిప్పుల కొండలా

రూపంలో చుక్కల దండలా

నవ్వుల్లో చిలకమ్మలా 

చిన్నారుల చేతికి బొమ్మలా

ఇంతకీ నువ్వొకడివా వందవా 

హా ఎంతకీ నువ్వెవరికీ అందవా !

ఇంతకీ నువ్వొకడివా వందవా ఆ ఆ

ఎంతకీ నువ్వెవరికీ అందవా !

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి