10, అక్టోబర్ 2021, ఆదివారం

పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని పాట లిరిక్స్ - Paruvaalu Kanivini Erugani Cheragani Taragani Telugu Song Lyrics - Satya (1988) Telugu Songs Lyrics






చిత్రం : సత్య (1988)

సాహిత్యం : రాజశ్రీ 

సంగీతం : ఇళయరాజా

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో..


జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు

తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం


నా సర్వం నీ సొంతం

నువ్వు కాదా నా ప్రాణం



పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో



జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు

తలుపులు తెరిచే ప్రేమ వీధిలో



కలలూరించనీ నీ కళ్ళు

చెలరేగించనీ పరవళ్ళు


నీ చూపులో వుంది మందారం

అది నాకు కావాలి సింధూరం


రాగాల నీ నవ్వులోన

రతనాలు నేనేరుకోనా


ఊరింత కవ్వింత పులకింత కలిగేను

కరిగేను నీ చెంత ఒళ్ళంతా


పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో..


జలతారు తొలకరి గడసరి

వలపుల తలపులు

తలుపులు తెరిచే ప్రేమ వీధిలో..


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం


నా సర్వం నీ సొంతం

నువ్వు కాదా నా ప్రాణం

పరువాలు కనివిని ఎరుగని

చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో



లాలలాలలాలా..లాలా..మ్.ఊఊఊ..

లాలలాలలాలా..లాలా..హే...

లాలాలా లాలలా..లాలాలా లాలలా..


అపురూపం కదా నీ స్నేహం

అనురాగానికే శ్రీకారం


అణువణువు నీలోన వున్నానే

అనుబంధమే పంచుకున్నానే


నీ కంటి పాపల్లె నేను..

వుంటాను నీ తోడు గాను


నీ మాట నా పాట కావాలీ

నీ వెంట ఈ జంట కలకాలం సాగాలి


పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో..


జలతారు తొలకరి గడసరి

వలపుల తలపులు

తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


ఈనాడు ఏనాడూ నేను నీ కోసం


నా సర్వం నీ సొంతం

నువ్వు కాదా నా ప్రాణం


పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని

కవితలు పలికే మూగ కళ్ళలో


జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు

తలుపులు తెరిచే ప్రేమ వీధిలో


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి