5, జూన్ 2021, శనివారం

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల పాట లిరిక్స్ - బాలు గారి స్మరణ లో - Aakasam Thaakela Vadagaalai Ee Nela Song Lyrics in Telugu - Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics















చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి  
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం






ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం

దాహంలో మునిగిన చివురుకు 
చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన 
రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్

ప్రాణం ఎపుడు మొదలైందో 
తెలుపగల తేదీ ఏదో 
గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో 
ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఏమంటే చెప్పేసే 
మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం 
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్

మండే కొలిమినడగందే 
తెలియదే మన్ను కాదు 
ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే 
పదునుగా నాటే నాగలి 
పోటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే 
వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకు తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో 
అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా 
రేయంతా నీ తలపులతో 
ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ 
ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఘల్







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి