30, అక్టోబర్ 2021, శనివారం

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి పాట లిరిక్స్ - Neethone Aagenaa Sangeetham Bilahari Telugu Song Lyrics - Rudraveena (1988) Telugu Songs Lyrics









చిత్రం : రుద్రవీణ (1988)

సంగీతం : ఇళయరాజా 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కె.జె.ఏసుదాసు 



 

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి

నీతోనే ఆగేనా సంగీతం

 

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి

నీతోనే ఆగేనా సంగీతం

 బిళహరీ అని పిలువకుంటే

స్వరవిలాసం మార్చుకుంటే

ఆరిపోదు గానజ్యోతినీతోనే ఆగేనా సంగీతం

 

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన

సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన

యుగయుగాలుగా జగాన దారి చూపగ

అనంతమైన కాంతి ధారపోసిన

అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం

 

నీతోనే ఆగేనా సంగీతం 

  

విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది

తరంగ స్వరాల జనించు గీతం ఏది

విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది

తరంగ స్వరాల జనించు గీతం ఏది

గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది

ఏ జ్ఞానం ఆ నాదం

పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ

పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ

అహంకరించి సాగుతున్న వేళలో

ఎడారిపాలు కాదా గానవాహిని

వినమ్రతే త్యజించితే - విషాదమే ఫలం కదా

 

నీతోనే ఆగేనా సంగీతం 

 

మగపద నీ..తోనే 

సరీగ రిగాప గపాద నీ...తోనే

సరిగ రిగప మగపద మగ రిగప

గపద మగపదదరి నీ...తోనే

పాదమ గపద రిస రీగరి సనిదప ద 

దాసరిగ పాగసరి గాపదస రీగసరి  సరిగపదరి నీతోనే

సరిగ పమగ  రిగపమగరి సాస సాస రీరి రీరి

సని ద సని ద పమ గ పమ గ

రిగమప గరి సనిదప ద రిగరి సనిదప

మగపద గసనిదప దని సనిద

సరిగపద రిగపద దరి

నీతోనే ఆగేనా సంగీతం

బిలహరి అని పిలవకుంటే 

స్వర విలాసం మార్చుకుంటే

ఆరిపోదు గాన జ్యోతి

నీతోనే ఆగేనా సంగీతం

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి