21, అక్టోబర్ 2021, గురువారం

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా పాట లిరిక్స్ - Oka Lalalana Oka Deevena Sadi Cheyavaa Song Lyrics in Telugu - Jyo Achyuthaananda (2016) Telugu Songs Lyrics

















చిత్రం : జ్యో అచ్యుతానంద (2016)

సంగీతం : కల్యాణి మాలిక్

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్

గానం : హరిణిరావ్


 





ఒక లాలన ఒక దీవెన

సడిచేయవా ఎద మాటునా

తియ తీయని ప్రియ భావన

చిగురించదా పొరపాటునా

 

కలబోసుకున్న ఊసులు

ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు

మెలమెల్లగా ఎటుపోయెనో

 

ఒక లాలన ఒక దీవెన

సడిచేయవా ఎద మాటునా

 

అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ

ఆనకట్టే వేసుకోకూ వద్దనీ

కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ

దాచేయకూ.. ఆపేయకూ ..

అటు వైపు సాగే అడుగునీ

 

ఒక లాలన ఒక దీవెన

సడిచేయవా ఎద మాటునా

తియ తీయని ప్రియ భావన

చిగురించదా పొరపాటునా

 

కలబోసుకున్న ఊసులు

ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు

మెలమెల్లగా ఎటుపోయెనో






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి