చిత్రం : రిథమ్ (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : శంకర్ మహదేవన్
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా
ఇచటే ...
అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే
వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన
ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే
అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే
వానవిల్లు గుండె తాకెనే
నాది ఏకాంతవాసమాయె దూరాన
ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే
ఆమె కనులబాటలేవో..
ఉసురేకమాయెనేమో
ఆమె కనులబాటలేవో..
ఉసురేకమాయెనేమో
జతకు సుఖమనిపించే
ఈ హృదయలయలొకటే
జతకు సుఖమనిపించే
ఈ హృదయలయలొకటే
నేను ఆమె ఒకటిగా ఎదే పాలవెల్లువ కాగా
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా
ఎండనైనా వేడినైనా
హీరోవచ్చి తాకగానే
పిల్లదానికెంత విసురూ
ఓహో చిచ్చుపెట్టు చిన్నదొచ్చి
హల్లో అంటూ చేతులిస్తే
తరుణి మోము కందిపోయే
అందగత్తె విడిచి వెళితే
నా జీవమిపుడు నిలిచే
అందగత్తె విడిచి వెళితే
నా జీవమిపుడు నిలిచే
చిన్నతగవొకటొస్తే
చిలకెగిరి పోయినదే
చిన్నతగవొకటొస్తే
చిలకెగిరి పోయినదే
మరల మరలి మనసుపడి
ఎదో ఆమె వచ్చినని తెలిసెలె..
ఇచటే
ఇచటే నేనిచటే నేనెదురు చూచి నిలిచా
తరమా నా తరమా నీ ఓర్పు గెలవ తలచా
పులకింతే ప్రేమంటే.. పులకింతే ప్రియురాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి