చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : శ్రేయా ఘోషల్
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి,ఝల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో, వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన
మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల వొడిలో ఈళ్ళని మురిపించగా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా
నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం
నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోదా హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి