14, ఆగస్టు 2021, శనివారం

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే పాట లిరిక్స్ - Usure Poyene Usure Poyene Kadhile Pedhavulu Choodagane Song Lyrics in Telugu - Villain (2010) Telugu Songs Lyrics











చిత్రం : విలన్ (రావణ్) (2010)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్    

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి   

గానం : కార్తీక్ 






ఈ భూమిలో ఏప్పుడంట నీ పుటక

నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన

ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా


ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన

ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా

ఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే ఇంకా

ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా


ఉసురే పోయెనే ఉసురే పోయెనే

కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతు ఉన్నా

మనసుని ఇవ్వవే మదనాల


అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి

అడుగుతువున్న ఉడుకు రుచి


ఒంటికి మనసుకు ఆమడ దూరం

కలిపేదెట్టా తెలియదుగా

మనసే చెప్పే మంచి సలహా

మాయ శరీరం వినదు కదా

తపనే తొలిచే నా పరువము బరువు కదా

చిలిపి చిలకే మరి నను గలికొలికే కదా


ఈ మన్మధ తాపం తీరునా

ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా

ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా


చందురుడు సూరీడు

చుట్టి ఒక్కచోట చేరిపోయే


సత్యమసత్యము

నేడు చీకటింటి నీడలాయే


ఉసురే పోయెనే ఉసురే పోయెనే

కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న

మనసును ఇవ్వవే మదనాల


అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి

అడుగుతువున్న ఉడుకు రుచి


ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి

తాను కాచుకోదు కళ్లులేని కట్టడిది


మనం చట్టమంటు గీసుకున్న గిరి ఇది

దాని బొక్కలెన్నో లెక్కపెట్టి చూడు మరి


మబ్బులు విడిచిన సూర్యుని చూసి

మొగ్గలు విచ్చును తామర

దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమరా


పామా వేరా అన్న తేడా తెలియదులే

పామే ఐనా ఇక వెనకడుగుండదులే


చితి మంటలు రేగిన వేళలో

నా కన్నుల చల్లని నీ రూపే

నే మట్టి కలిసిన మదిలో నీవే


చందురుడు సూరీడు

చుట్టి ఒక్కచోట చేరిపోయే

సత్యమసత్యము

నేడు చీకటింటి నీడలాయే


ఉసురే పోయెనే ఉసురే పోయెనే

కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న

మనసును ఇవ్వవే మదనాల


అందని తీరాన నీవున్నా

హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి

అడుగుతువున్న ఉడుకు రుచి


ఉసురే పోయెనే ఉసురే పోయెనే

కదిలే పెదవులు చూడగనే

ఓ ప్రేమకు తపించి వేడుతువున్న

మనసును ఇవ్వవే మదనాల

అందని తీరాన నీవున్నా

హత్తుకుపోవే దరిచేరి

అగ్గిపండు నువ్వని తెలిసి

అడుగుతువున్న ఉడుకు రుచి


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి