చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్
ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
ఓ ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
ఓ మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
ఓ పరిచయం ఎప్పుడూ
చిన్నదే(ఊ ఊఊ..)
ఈ చెలిమికే కాలమే
చాలదే(ఊ ఊఊ..)
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
ఓ మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
ఆట లాగ పాట లాగ
నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరదంట
వద్దు అంటే వెళ్ళదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట
ఇస్తూ నీకై ప్రాణం
పంచిస్తూ తన అభిమానం
నీ ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటీ బాతేఁ
(ఛోటి ఛోటీ బాతేం బాతేఁ)
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
(మీఠి మీఠీ యాదేం యాదేఁ)
గుర్తులేవి లేని నాడు
బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చయేవి సావాసాలే
బాధలేవీ లేని నాడు
నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చేరగదే స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ
నీ కలనే తనదిగా కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
(ఊ ఊఊ..)
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటీ బాతేఁ
(ఛోటి ఛోటీ బాతేం బాతేఁ)
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
(మీఠి మీఠీ యాదేం యాదేఁ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి