5, ఆగస్టు 2021, గురువారం

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ - Nee Chitram Choosi Naa Chittam Chediri Telugu Song Lyrics - Love Story (2021) Telugu Songs Lyrics






చిత్రం : లవ్ స్టోరీ (2021)

సంగీతం : పవన్ సిహెచ్   

సాహిత్యం : మిట్టపల్లి సురేందర్ 

గానం : అనురాగ్ కులకర్ణి 


 

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి

నే చిత్తరువైతిరయ్యో

ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు

నిన్నే ఎంచుకుందిరయ్యో

 

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి

నే చిత్తరువైతిరయ్యో

ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు

నిన్నే ఎంచుకుందిరయ్యో

 

నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు

నీ గుండె మీదనే వేసుకుందు 

నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో

 

ఈ దారిలోని గందరగోళాలే 

మంగళ వాయిద్యాలుగా

చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో 

మన పెళ్ళీ మంత్రాలుగా

అటు వైపు నీవు నీ వైపు నేను

వేసేటి అడుగులే ఏడు అడుగులని

ఏడు జన్మలకి ఏకమై పోదామా

 

ఎంత చిత్రం ప్రేమ 

వింత వీలునామ 

రాసింది మనకు ప్రేమా

నిన్ను నాలో దాచి 

నన్ను నీలో విడిచి

వెళ్లి పొమ్మంటోంది ప్రేమా

 

ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ 

ఆఆ ర రా ఆఆ ఆఆ…

 

ఈ కాలం కన్న 

ఒక క్షణం ముందే

నే గెలిచి వస్తాననీ

నీలి మేఘాలన్ని పల్లకిగ మలిచి 

నిను ఊరేగిస్తానని

ఆకాశమంత మన ప్రేమలోన 

ఏ చీకటైన క్షణకాలమంటు

నీ నుదుట తిలకమై 

నిలిచిపోవాలనీ

 

ఎంత చిత్రం ప్రేమ 

వింత వీలునామ రాసింది

మనకు ప్రేమా



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి