7, ఆగస్టు 2021, శనివారం

మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి పాట లిరిక్స్ - Mounamelanoyi Ee Marapu Raani Reyi Telugu Song Lyrics - Saagara Sangamam (1982) Telugu Songs Lyrics







చిత్రం : సాగర సంగమం (1982)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి


 

ఆఆఆఆఆఆఅ...

మౌనమేలనోయి...

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

 

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

తారాడే హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

 

పలికే పెదవి వొణికింది ఎందుకో?

వొణికే పెదవి వెనకాల ఏమిటో?

కలిసే మనసులా.. విరిసే వయసులా

కలిసే మనసులా.. విరిసే వయసులా 

నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..

ఏమేమో అడిగినా 

 

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

 

హిమమే కురిసే చందమామ కౌగిట

సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట

ఇవి ఏడడుగుల వలపూమడుగుల

ఇవి ఏడడుగుల వలపూమడుగుల

కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు...  

ఎంతెంతొ తెలిసిన

 

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల

తారాడే హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి