6, ఆగస్టు 2021, శుక్రవారం

నిలువద్దము నిను ఎప్పుడైనా పాట లిరిక్స్ - Niluvaddamu Ninu Epudaina Telugu Song Lyrics - Nuvvosthanante Nenoddhantana (2004) Telugu Songs Lyrics





చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2004)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : కార్తీక్, సుమంగళి


 

ఊ...నిలువద్దము నిను ఎప్పుడైనా 

నువ్వు ఎవ్వరు అని అడిగేనా

ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా...

నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా..

ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా...

నీ కన్నుల మెరిసే రూపం.. నాదేనా అనుకుంటున్నా

నీ తేనెల పెదవులు పలికే.. తియ్యదనం నాపేరేనా

అది నువ్వే.. అని నువ్వే.. చెబుతూ ఉన్నా..

 

నిలువద్దము నిను ఎప్పుడైనా 

నువ్వు ఎవ్వరు అని అడిగేనా

ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా..

 

ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు 

నామాట విన్నట్టు నేనాపలేనంతగా...

భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు

నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా... 

నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు...

నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు.. 

లలల...లలలై...లలల...లలలై

లలల...లలలై...లలల...లలలై...

 

నిలువద్దము నిను ఎప్పుడైనా 

నువ్వు ఎవ్వరు అని అడిగేనా

ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా....

 

ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు

ఈ జోరు కంగారు పెట్టేంతగా...

 తడబడకు నన్ను అడుగు... చెబుతాను పాఠాలు

నీలేత పాదాలు.. జలపాత మయ్యేట్టుగా

నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం.. 

మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం ...

 

లలల...లలలై...లలల...లలలై

లలల...లలలై...లలల...లలలై



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి