13, ఆగస్టు 2021, శుక్రవారం

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా పాట లిరిక్స్ - Oo Sona Nee Korake Prathi Divve Navvindhila Song Lyrics in Telugu - Mom (2017) Telugu Songs Lyrics












చిత్రం : మామ్ (2017)

సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్

సాహిత్యం : అనంత శ్రీరామ్

గానం : హేమచంద్ర, ప్రియాంక


 




నీ దారి పూదారిలా వేచున్నదే చూడవే

దాదా అని ఓ వెన్నెలా పిలిచిందే నిజంగా వెళ్ళవే

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా

ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా

 

రారా ముందుకీ అంటుందీ క్షణం

దూరాన్నోడిద్దాం ఈ రోజే మనం

ఇవ్వాళీ గుండెల్లో ఆశ ఇది ఈనాటిదే

రేపె రెప్పల్లో అందాల వనం

 

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా

నీ కోసమే నీ కోసమే

ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా

నీ కోసమే నీ కోసమే

 

కంటి చెమ్మనీ అంటనివ్వమే

కొంటె నవ్వునీ వాడనివ్వమే

ఏమేమి చేస్తున్నా ఏవో తప్పవే

సాగే జీవితం ఎంత చిత్రమే

 

ఓ సోనా నీ కొరకే ప్రతి దివ్వే నవ్విందిలా

ఓ సోనా నీ కొరకే ఫలిస్తోంది రోజూ ఓ కలా

నీ కోసమే నీ కోసమే






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి