6, ఆగస్టు 2021, శుక్రవారం

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ పాట లిరిక్స్ - Aadibhikshuvu Vaadinedi Koredi Telugu Song Lyrics - Sirivennela (1987) Telugu Songs Lyrics







చిత్రం : సిరివెన్నెల (1987)

సంగీతం : కె.వి.మహదేవన్‌

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

 


ఆదిభిక్షువు వాడినేది కోరేదీ

బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ

బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది 

 

ఏది కోరేదీ వాడినేది అడిగేది

ఏది కోరేదీ వాడినేది అడిగేది

 

తీపిరాగాల కోకిలమ్మకు

నల్ల రంగునలమిన వాడినేది కోరేది

తీపిరాగాల కోకిలమ్మకు

నల్ల రంగునలమిన వాడినేది కోరేది

కరకు ఘర్జనల మేఘముల మేనికి

మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది 

 

ఏది కోరేదీ వాడినేది అడిగేది

ఏది కోరేదీ వాడినేది అడిగేది

 

తేనెలొలికే పూల బాలలకు

మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది

తేనెలొలికే పూల బాలలకు

మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని

ఆనతిచ్చిన వాడినేది అడిగేది 

 

ఏది కోరేదీ వాడినేది అడిగేది

ఏది కోరేదీ వాడినేది అడిగేది

 

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప

దరిజేరు మన్మధుని మసిజేసినాడు

వాడినేది కోరేది

వరగర్వమున మూడులోకాల పీడింప

తలపోయు దనుజులను కరుణించినాడు

వాడినేది అడిగేది

ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు

వాడినేది కోరేదీ

ముక్కంటి ముక్కోపి

ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

 

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ

బూడిదిచ్చేవాడినేది అడిగేది

ఏది కోరేదీ వాడినేది అడిగేది 



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి