చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా…
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా...
కొమ్మలో పువ్వులు కోతవరకెనులే
కురులలో పువ్వులు మగనితోపోవులే
ప్రేమ కథ ఒక్కటే లే సాగు కలకాలమే
వాన పయనాలన్నీ నేల వరకెనులే
పడవ పయనాలన్నీ రేవు వరకెనులే
మనిషి పయనాలు అన్నీ జీవితాంతం లే
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా...
గాలి వీచిందని ఆకు తెలిపెనులే
వర్షమొచ్చిందని తేమ తెలిపెనులే
చిందు కన్నీటి ధార ప్రేమనే తెలుపులే
ఆకులే రాలిన కొమ్మ బతికుందిలే
రేయి తెలవారినా జాబిలీ ఉందిలే
తోడు నిను వీడిపోయినా జీవితం ఉందిలే
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే బ్రతుకు అందునా విధి చెలగాటమందునా
కదిలే కాలమందునా ఓ మనసా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి