9, ఆగస్టు 2021, సోమవారం

మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో పాట లిరిక్స్ - Manchido Cheddadho Rentiki Madhyadho Telugu Song Lyrics - Middle Class Melodies (2020) Telugu Songs Lyrics






చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

సంగీతం : స్వీకార్ అగస్తి

సాహిత్యం : సానపతి భరధ్వాజ పాత్రుడు

గానం : విజయ్ ఏసుదాస్ 


 

మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో 

అంతుచిక్కలేదా కాలమెటువంటిదో

కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో

లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో

ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం

వేచి ఉంటె రాదారి చూపించదా

చిక్కు ప్రశ్నలేసేటి తెలివైన కాలం 

తప్పకుండ బదులై రాదా

 

మదిలోని చిరునవ్వు జన్మించగా

కలతే పోదా కనుమూయదా

నడిరేయి దరిచేరి మసి పూయగా

వెలుగేరాదా చెరిపేయదా

అరచేతి రేఖల్లో లేదంట రేపు

నిన్నల్ని వదిలేసి రావాలి చూపు

చూడొద్దు ఏదంటు ఓదారుపు..

వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ

ఉండిపోవు కడదాకా ఆ నింగిలా

అంతమైతే కారాదు లోలోని దైర్యం

అంతులేని వ్యధలే ఉన్నా

 

సంద్రాన్ని పోలింది ఈ జీవితం

తెలిసే తీరాలి ఎదురీదడం

పొరపాటు కాదంట పడిపోవడం

ఉండాలోయ్ లేచే గుణం

ఎటువంటి ఆటంకమెదురైనా గాని

మునుముందు కెళ్ళేటి అలవాటు మాని

కెరటాలు ఆగేటి రోజేదనీ

గంతలన్నీ ఓనాడూ తీసేసి కాలం

వాస్తవాన్ని కళ్లారా చుపించదా

కమ్ముకున్న భ్రమలన్ని కావాలి మాయం

కిందపడ్డ తరువాతైనా

 

తన్నేనా తన్నేనా తన్నేనా తన్నేనా

తానే నానె నానా తానే నానె నానేనా

తన్నేనా తన్నేనా తన్నేనా తన్నేనా

తన్నే నానె నానా తన్నే నానె నానేనా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి