చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : చిత్ర
దోబూచులాటేలరా...
దోబూచులాటేలరా... గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆ ఏటి గట్టునేనడిగా
చిరు గాలి నాపి నేనడిగా
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
ఆకాశాన్నడిగా.. బదులే లేదు
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా
చివరికి నిన్నే చూసా
హృదయపు గుడిలో చూసా...
దోబూచులాటేలరా గోపాలా..
నా మనసంత నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయా...
నా మది నీకొక ఆటాడు బొమ్మయ..
నాకిక ఆశలు వేరేవి లేవయ ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా.. గోపాలా..ఆ..
నీ అధరాలు అందించ రా.. గోపాల
నీ కౌగిలిలో కరిగించరా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా....
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ..
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ల బ్రోచేవు
పూవున కన్నే నీ మతమా
నేనొక్క స్త్రీనే కదా గోపాల
అది తిలకించ కన్నులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ ఎపుడూ నీవే అండ
కాపాడరా...ఆఆ..
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంత నీవేనురా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి