బాలాజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాలాజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జనవరి 2022, ఆదివారం

ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో పాట లిరిక్స్ - Uppenantha Ee Premaki Guppedantha Gunde Emito Song Lyrics in Telugu - Arya-2 (2009) Telugu Songs Lyrics









చిత్రం : ఆర్య-2 (2009)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : బాలాజీ

గానం: కె.కె

 


ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

తీయనైన ఈ బాధకీ .. ఉప్పు నీరు కంట దేనికో

రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో

ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ .. లోకమంత ఇంక ఎందుకో

రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని ఫిక్షన్లెందుకో

 

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా

I Love You .. నా ప్రాణం పోయినా

I Love You .. నా ప్రాణం పోయినా

 

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

 

కనులలోకొస్తావు .. కలలు నరికేస్తావు

సెకనుకోసారైనా చంపేస్తావూ

మంచులా ఉంటావు .. మంట పెడుతుంటావు

వెంటపడి నా మనసు మసి చేస్తావూ

తీసుకుంటె నువ్వు ఊపిరీ .. పోసుకుంట ఆయువే చెలీ

గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరి !

 

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా

I Love You .. నా ప్రాణం పోయినా

 

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

 

చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే

మబ్బులే పోగేసి కాల్చెయ్యనా

చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే

తొలకరే లేకుండా పాతెయ్యనా

నిన్ను కోరి పూలు తాకితే .. నరుకుతాను పూలతోటనే

నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !

 

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా

I Love You .. నా ప్రాణం పోయినా

 

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో

చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

 


 

1, జనవరి 2022, శనివారం

నాకోసం మారవా నువ్వు పాట లిరిక్స్ - Naakosam Maaravaa Nuvvu Leka Song Lyrics in Telugu - Bangaarraju (2022) Telugu Songs Lyrics








చిత్రం : బంగార్రాజు (2022)

సాహిత్యం : బాలాజీ 

సంగీతం : అనూప్ రూబెన్స్ 

గానం : సిద్ శ్రీరామ్ 



కొత్తగా నాకేమయ్యిందో 

వింతగా ఏదో మొదలైందో 

అంతగా నాకర్ధంకాలేదే 


మెరుపులా నీ చూపేమందో 

చినుకులా నాపై వాలిందో 

మనసిలా నీవైపే తిరిగిందే 


ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు 

మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు 


నాకోసం మారవా నువ్వు 

లేకా నన్నే మార్చేసవా నువ్వు 

నాకోసం మారవా నువ్వు 

లేకా నన్నే మార్చేసవా నువ్వు 


ఓ నవ్వులే చల్లావు పంచుకోమన్నావు 

తొలకరి చిరుజల్లై నువ్వు 

ఓ .. ఓ .. 

కళ్లకే దొరికావు రంగుల మెరిసావు 

నేలపై హరివిల్లా నువ్వు 


నిన్నా మొన్నల్లో ఇలా లేనే లేనంటా 

నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా 


మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు 


నీకోసం మారానే నేను 

నీతో నూరేళ్లు ఉండేలా నేను

నీకోసం మారానే నేను 

నీతో నూరేళ్లు ఉండేలా నేను 


ఓ .. మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా 

మనసుతో పిలిచావా నన్ను 

ఓ ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా 

ఎదురుగా నిలిపావా నిన్ను 


పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా 

నాకే ఈవేళ నేనే నచ్చా నీవల్లా 


మోమాటలే దూరంచేసే 

మాట నీకు చెప్పేలా 

ఓ ఓ నీవెంటే ఉంటున్నా నేను 

నువ్వే లేకుంటే ఉంటానా నేను 

నీవెంటే ఉంటున్నా నేను 

నువ్వే లేకుంటే ఉంటానా నేను