29, మార్చి 2022, మంగళవారం

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం పాట లిరిక్స్ - Venugaana Sammohanam Veli Meeda Govardhanam Song Lyrics in Telugu - Swarabhishekam (2004) Telugu Songs Lyrics



















చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : వేటూరి సుందరరామమూర్తి
గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్






కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం ఓ.. వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె
ఆలారే......
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం

పాల చెక్కి నెతినెత్తి అమ్మబోతె కిట్టయ్య
యేలు పెట్టి ఎంగిలి చేతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
మాటు చూసి మడుగులోన మునగబోతె కిట్టయ్య
సీరలు గుంజి చక్కా పోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
యేరే కోక నీరే రైక అంటాడమ్మో
అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే

మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో
పాలెందుకంటాడు ఓలమ్మో
హే..సిగ్గొచ్చి చుట్టేసి చీరెందుకంటాడు ఓలమ్మో
ఓలమ్మో..
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లిపోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు
వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు

ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారె ఆలారె ఆనందబాల
అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారే........

వేణుగాన సమ్మోహనం..వేణుగాన సమ్మోహనం
వేలి మీద గోవర్ధనం..వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం..రేపల్లె మానందనం
వేనోళ్ళ నీ కీర్తనం..వేనోళ్ళ నీ కీర్తనం

కృష్ణా!....ముకుందా!.....మురారీ!......

నంద యశోదా, నందనులకు 
నవ మదనదేవునకు గొబ్బిళ్ళు
చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళు
ఉసురు గాలులను వెదురు పాటలుగ
ఆ...........
ఉసురు గాలులను వెదురు పాటలుగ
పలుకు వేణువుకు గొబ్బిళ్ళు..

ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నెల్లో
కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో
వేదనంతా వెన్నలాగా కరిగే వేళళ్ళో

ఏ గీత మాకిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో ఆరారే...

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం వేనోళ్ళ నీ కీర్తనం

ఆలారే మేఘాలొచ్చి ఆనందాలే జల్లై కురిసే
ఆలారే........







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి