30, మార్చి 2022, బుధవారం

యదుమౌళి ప్రియసతి నేనే పాట లిరిక్స్ - Yadhumouli Priyasathi Nene Song Lyrics in Telugu - Deepavali (1960) Telugu Songs Lyrics






















చిత్ర : దీపావళి (1960)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్యులు
గానం : పి.సుశీల, ఘంటసాల, ఎ.పి.కోమల 









యదుమౌళి ప్రియసతి నేనే 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

లేదు భూమిని నా సాటి భామా 
లేదు భూమిని నా సాటి భామా 
అందచందాలు నీవేను లేమా
అందచందాలు నీవేను లేమా
నీ హృదయేశ్వరి నేనేగా 

యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 

హే ప్రభూ 
నీ సేవయె చాలును నాకూ 
హే ప్రభూ
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
తనువు మీర మీ సన్నిది జేరి
మనసు దీర నీ పూజలు చేసీ 
మురిసెడి వరము నొసగుము స్వామీ 
అదియే నాకు పరమానందమూ 
హే ప్రభూ

సోగ కన్నుల నవ్వారబోసీ 
సోగ కన్నుల నవ్వారబోసీ 
పలుకు పంతాల బందీని జేసీ 
కోరిక తీరగ ఏలేగా 
 
యదుమౌళి ప్రియసతి నేనే
నాగీటు దాటి చనజాలడుగా
యదుమౌళి ప్రియసతి నేనే 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి