8, మార్చి 2022, మంగళవారం

సరిసరీ వగలు తెలిసెర గడసరీ పాట లిరిక్స్ - Sarisari Vagalu Telisera Gadasari Song Lyrics in Telugu - Bhakta Thukaraam (2004) Telugu Songs Lyrics






















చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం : పి.ఆదినారాయణరావు 
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల










సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...
తొలిఝామైన కానిదే
తొలిఝామైన కానిదే
తొందర ఎందుకు ఎందుకంటిరా..ఆ..

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
ఆ... మంచిగంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే 
ఆ... మంచిగంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే 
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ... ఆ... ఆ...
కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల చాలించవేరా

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
ఆ... పండువెన్నెల
పానుపు చేసి
పైట కొంగున వీవన వీచీ
వేడిముద్దులు కానుక చేసి
విడని కౌగిట బందీచేసి
ఎన్నడెరుగని
వన్నెతరుగని
కన్నెవలపులు అందించి
అందాలు చిందింతులేరా 

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ..








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి