చిత్రం : మనసిచ్చి చూడు (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : హరిహరన్, చిత్ర
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా
యమున... యమున... యమునా...
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా
నా మదీ ..మహానది..వరదౌ...తున్నదీ
ఈ ఇదీ ఇలాం..టిదీ ఎపుడూ లేనిదీ
తను అలా ఎదురౌ క్షణాన..
నిలువునా కదిలిపోనా
నిలవనా మరీ మరో జగానా
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా
నా బలం ..ధనం..జనం
యమునా స్నేహమే
నా స్థలం... నిరంతరం
యమునా... తీరమే
మనసే కోరి వలచే
మమతే తనది కాదా
మునగనా.. తనా
మనస్సులోనా
జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా
యమున... యమున... యమునా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి