9, మార్చి 2022, బుధవారం

భువన మోహిని అవధి లేని యుగయుగాల అమృతవాహిని పాట లిరిక్స్ - Bhuvana Mohini Avadhi Leni Yugayugala Song Lyrics in Telugu - Bhaama Vijayam (1967) Telugu Songs Lyrics



















చిత్రం : భామా విజయం (1967)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి 
గానం : ఘంటసాల 





భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

నీల నీల కుంతలా 
విలోల మృదుల చేలాంచల 
తరళ తరళ భావ గగన
సురభిళ నవ చంచలా 
మధుర మధుర హాసిని
మదన హృదయ వాసిని

భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

మద మరాళ గామిని
మంజుల మధు యామిని
ఝళం ఝళిత మణి నూపుర
లలిత లయ విలాసిని
రాగ తాళ భావ రంజని
తథీం తనన 
తథీం తనన 
తథీం తనన 

భువన మోహిని
అవధి లేని యుగయుగాల
అమృతవాహిని







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి