29, మార్చి 2022, మంగళవారం

ఏమంటున్నది ఈ గాలీ ఎగిరే పైటను అడగాలీ పాట లిరిక్స్ -Yemantunnadhi Ee Gaali Yegire Paitanu Song Lyrics in Telugu - Memoo Manushulame (1973) Telugu Songs Lyrics



















చిత్రం : మేమూ మనుషులమే (1973)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల







ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..

ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి 
అహ..అహ..హ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి

ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ

పైటకు తెలుసు చాటున 
పొంగే ప్రాయం రెపరెపలూ...
గాలికి తెలుసూ విరిసీ విరియని 
పూవుల ఘుమఘుమలూ..
ఊగే నడుమూ.. సాగే జడతో..
వేసెను పంతాలూ..ఊ..
నీలో వుడుకూ.. నాలో దుడుకూ.. 
చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...

మబ్బు మబ్బుతో ఏకమైనది.. 
సాయం సమయంలో...ఓ..
మనసు మనసుతో లీనమైనది.. 
మమతల మైకంలో...ఓ..
అల్లరి కళ్లూ.. వెన్నెల నవ్వూ.. 
పెట్టెను గిలిగింతా..
వెచ్చని వొడిలో.. ఇచ్చిన చోటున.. 
ఇమిడెను జగమంతా..
ఇమిడెను జగమంతా..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...
అహ..హ..అహా...లల..ల.లా.లా..
అహ..హ..అహా...లల..ల.లా.లా..







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి