2, మార్చి 2022, బుధవారం

వీణ నాది తీగ నీది తీగ చాటు రాగ ముంది పాట లిరిక్స్ - Veena Naadhi Teega Needi Teega Chaatu Song Lyrics in Telugu - Katakatala Rudrayya (1978) Telugu Songs Lyrics





















చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి.రాఘవులు  
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యంపి.సుశీల 






వీణ నాది..తీగ నీది
తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..
ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..
తీగ చాటు రాగ ముంది.. 
తీగ చాటు రాగ ముంది...  
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు

తొలిపొద్దు ముద్దాడగానే 
ఎరుపెక్కె తూరుపు దిక్కూ 
తొలిచూపు రాపాడగానే 
వలపొక్కటే వయసు దిక్కూ 
వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి
వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు 

వీణ నాది తీగ నీది 
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు

మబ్బుల్లో మెరుపల్లే కాదూ 
వలపు వాన కురిసీ వెలిసి పోదూ
మనసంటే మాటలు కాదూ 
అది మాట ఇస్తే మరచి పోదూ 
బ్రతుకల్లే జతగూడి 
వలపల్లె ఒనగూడి 
వొడిలోనే గుడి కట్టే దిక్కు 
నా గుడి దీపమై నాకు దక్కూ 

వీణ నాది తీగ నీది
తీగ చాటు రాగ ముంది 
పువ్వు నాది పూత నీది
ఆకుచాటు అందముంది
వీణ నాది.. తీగ నీది..
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి