9, మార్చి 2022, బుధవారం

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ- పాట లిరిక్స్ - Ichakalu Naku Neeku Song Lyrics in Telugu - Tenali Ramakrishna (1956) Telugu Songs Lyrics





















చిత్రం : తెనాలి రామకృష్ణ (1956)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్, రామ్మూర్తి  
సాహిత్యం : అన్నమయ్య కీర్తన  
గానం : పి.లీల 








ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి

జట్టి గొంటివిదె నన్ను జాలదా వోరి యీ-
చిట్టంట్ల నీవేఁచక చిత్తగించరా
ఎట్టైనా నేనీకింత యెదురా వోరి నీ-
పట్టిన చలమే చెల్లె బాపురా వోరి

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి

వేసాల వేంకటగిరివిభుఁడా నేఁడోరి నీ-
సేసిన మన్ననలిట్టె చిత్తగించరా
వాసన కస్తూరిమేని వన్నెకాఁడ నీ-
యాసల మేకులే దక్కెనద్దిరా వోరి

ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-
యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి