8, మార్చి 2022, మంగళవారం

జయహే కృష్ణావతారా నంద యశోదా పుణ్యావతారా పాట లిరిక్స్ - Jayahe Krishnavathara Nanda Yashoda Punyavathara Song Lyrics in Telugu - Sri Krishnavatharam (1967) Telugu Songs Lyrics




















చిత్రం : శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సముద్రాల 
గానం : ఘంటసాల, పి.లీల, సరోజిని, స్వర్ణలత 
 









జయహే కృష్ణావతారా
నంద యశోదా పుణ్యావతారా
జయహే కృష్ణావతారా
పాపుల నణచీ సాధుల బ్రోవగ
వ్రేపల్లె వెలసిన గోపకిశోరా
జయహే కృష్ణావతారా
 
ఎన్నోజన్మల పున్నెము పండీ 
నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ
కన్నతల్లి నీ కడుపెరుగదు నా
చన్నుగుడువ కనుమూసెదు రారా
 
విషపూతన ప్రాణాపహారీ
శకటాసుర సంహారీ శౌరీ 
జయహే కృష్ణావతారా
 
కాపురమ్ము సేయలేమమ్మా వ్రేపల్లెలోన
ఓ యశోదా ఈ పాపమెందూ చూడలేదమ్మా
పాలు వెన్నమనగనీడు
పడుచునొంటిగ చనగనీడు
కలిమి ఉంటే కట్తి కుడుతురు 
కన్న సుతునిటు విడుతురా
కాపురమ్ము సేయలేమమ్మా
 
జయహే కృష్ణావతారా
నందకుమారా నవనీత చోరా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కాళింగ మడుగున, కాళీయ పడగల
కాలూని ధిమి ధిమి నాట్యము చేసి
సర్పాధీశుని దర్పము నణచిన
తాండవ నాట్యవినోదా
 
జయహే కృష్ణావతారా
కాళీయ మణిగణ రంజిత చరణా
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
తనువులపై అభిమానము వీడిన గాని
తరణులార ననుజేర తరము గాదులే 
సిగ్గువదలి యిరుచేతుల జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా
 
జయహే కృష్ణావతారా
గొపకుమారీ వస్త్రాపహారా 
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
బాలుడితడనీ శైలము 
చాల బరువనీ
మీ భయము వదలుకొండీ
నా అండను చేరగరండీ
ఈ కేలల్లాడదు నమ్మండీ
 
గోవర్థన గిరిధారీ
సురనాయక గర్వాపహారీ
జయహే కృష్ణావతారా
జయహే కృష్ణావతారా
 
కృష్ణా...ఆఆఆ...ఆఆఆ... 
రాధా మానసచోరా
నీ మధు మురళీ గానమునా 
నా మనమూ బృందావనమూ
నిలువున పూచీ నీ పద పూజకు
పిలిచేనోయీ రావోయీ
సేవలు చేకొన రావోయీ 
రాధా మానస చోరా కృష్ణా..ఆఆ.. 









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి