చిత్రం : రావోయి చందమామ (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
జుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభ మంగళ వాద్యాలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో
పల్లవించె నా గీతం పలకరించె సంగీతం
ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలొ
తరుముకొచ్చె ఉల్లాసం,తలను వంచె కైలాసం
ఒక్కసారి వస్తయ్ తియ్యని క్షణాలెన్నో
ఒక్కటవ్వమంటయ్ తీరని రుణాలే
శుభలేఖనుకో నా గీతం.
నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటంలో
దేవతాయే నీ రూపం, దీవెనాయే నా ప్రాణం
వయ్యారాలను ఉయ్యాలూపిన ఈ వైభోగంలో
మౌనమాయే నా భావం, రాగమాయే నీ కోసం
మూడు ముళ్ళ బందం ఏడు జన్మలనుబంధం
వేణువైన నాలో ఆలాపనైన గానం
ఆశీస్సనుకో అనురాగం..
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభ మంగళ వాద్యాలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి