2, మార్చి 2022, బుధవారం

మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదూ పాట లిరిక్స్ - Medante Medaa Kaadhu Goodante Song Lyrics in Telugu - Sukha Dukkhalu (1968) Telugu Songs Lyrics




















చిత్రం : సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం







మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన 
పొదరిల్లు మాది  

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

కోవెలలొ వెలిగే దీపం 
దేవి మా తల్లి
కోనలలో తిరిగే పాటల 
గువ్వ మా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు 
గొరవంక గాని
వంకంటే వంకా కాదు 
నెలవంక గాని

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గూడంతా గుబులై పోదా 
గుండెల్లో దిగులై పోదా 

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి