29, మార్చి 2022, మంగళవారం

మున్నీట పవళించు నాగశయన పాట లిరిక్స్ - Munneta Pavalinchu Nagasaya Song Lyrics in Telugu - Bhookailaas (1958) Telugu Songs Lyrics














చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఎం.ఎల్.వసంతకుమారి








మున్నీట పవళించు నాగశయన
మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన..
నీ నాభి కమలాన కొలువు జేసే...ఆ...ఆ...
నీ నాభి కమలాన కొలువు జేసే..
వాణీశు భుజపీఠి బరువువేసి
వాణీశు భుజపీఠి బరువువేసి...పాల..

మున్నీట పవళించు నాగశయన

మీనాకృతి దాల్చినావు..
వేదాల రక్షింప మీనాకృతి దాల్చినావు
కూర్మాకృతి బూనినావు..
వారిధి మధియింప కూర్మాకృతి బూనినావు
కిటి రూపము దాల్చినావు
కనకాక్షు వధియింప కిటి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప
నరసింహమై వెలసినావు...
నరసింహమై వెలసినావు...
నటపాల మమునేల జాగేల...
నటపాల మమునేల జాగేల పాల

మున్నీట పవళించు నాగ శయన

మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహనా
మోహినీ విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనోమోహనా
మందహాస మధురవదన రమానాయక
మందహాస మధురవదన రమానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల.. పాల

మున్నీట పవళించు నాగశయన
చిన్నారి దేవేరి సేవలుసేయ
మున్నీట పవళించు నాగశయన







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి