చిత్రం : శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దేవులపల్లి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నా పేరు బికారి నా దారి ఎడారి..
మనసైన చోట మజిలీ..
కాదన్న చాలు బదిలీ..
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
అసలు నా మరోపేరు ఆనంద విహారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
మేలుకొని కలలుగని మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని
ఆ.... ఆ...... ఆ..... ఆ.....
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని
ఆకాశవీధిలో పయనించు బాటసారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
కూటికి నే పేదను గుణములలో పెద్దను
కూటికి నే పేదను గుణములలో పెద్దను
సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా పేరు బికారి నా దారి ఎడారి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి