చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా...
లేని తగవు నటింతువా
మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా
మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక
దయనుజూడవా... ఆ.. ఆ...
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
నీవె నాకు ప్రాణమని
నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని
నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని
నింద యెరుగవా...ఆ...ఆ..
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...
ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా
కనికరింపవా..ఆ...ఆ...ఆ..
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి