8, మార్చి 2022, మంగళవారం

నరవరా ఓ కురువరా పాట లిరిక్స్ - Naravara O Kuruvara Song Lyrics in Telugu - Narathanasala (1963) Telugu Songs Lyrics




















చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : యస్.జానకి







నరవరా....ఆ ఆ ఆ
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి.. లేరనీ
సరసులలో జాణవనీ
విన్నారా.. కన్నారా..
విన్నారా కన్నారా కనులారా

సురపతి నెదిరించి రణాన 
పశుపతి మురిపించి బలాన
సురపతి నెదిరించి రణాన 
పశుపతి మురిపించి బలాన

సాటి లేని వీరుండన్న యశమును గన్నా
సాటి లేని వీరుండన్న యశమును గన్నా

అర్జున ఫల్గుణ పార్థ కిరీటి 
బిరుదు గొన్న విజయా 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

నిను గనీ తల ఊచే ఉలూచీ 
కొనుమనీ చెయి సాచే సుభద్రా
నిను గనీ తల ఊచే ఉలూచీ 
కొనుమనీ చెయి సాచే సుభద్రా

నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న

అలరుల విలుతుని 
ములుకుల గురియై 
వలపులమ్ముకొనురా

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి