31, మార్చి 2022, గురువారం

పాలించరా రంగా పరిపాలించరా రంగా పాట లిరిక్స్ - Paalinchara Ranga Paripaalinchara Ranga Song Lyrics in Telugu - Vipranarayana (1954) Telugu Songs Lyrics























చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల 
గానం : ఏ.ఎం.రాజా






పాలించరా రంగా 
పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా...
పాలించర రంగా.. 

మరువని తల్లివి... తండ్రివి నీవని...
మరువని తల్లివి... తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా...
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా... శ్రీరంగా

పాలించర రంగా... 

మనసున నీ స్మృతి మాయకమునుపే 
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ...రంగా
కనియద మనసారా...

పాలించరా రంగా 
పరిపాలించరా రంగా

కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా... 
సురభోగాలను కోరనురా...
దరి కనరానీ భవసాగరమును....
దాటించుమురా గరుడ తురంగా...

పాలించరా రంగా 
పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా.. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి