చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : జిక్కి, చిత్ర, బృందం
వెలుగూ రేఖల వారు
తెలవారి తామొచ్చి
ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకా ముక్కుల వారు
చీకటితోనే వచ్చి
చిగురు తోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు
మందార పువ్వంటి మా బామ్మని...
అమ్మమ్మనీ
నోమీ నమ్మల్లాల్లో నోమన్నలాలో
సందమామా సందమామా
నోచే వారింటిలోన పూచే పున్నాలబంతి
సందమామా సందమామా...
పండంటి ముత్తైదు సందమామా
పసుపు బొట్టంత మా తాత సందమామా
నోమీ నమ్మల్లాల్లో నోమన్నలాలో
సందమామా సందమామా
నోచే వారింటిలోన పూచే పున్నాలబంతి
సందమామా సందమామా...
కూర్చుని చెరిగే చేతి కురులపై
తుమ్మెదలాడే ఓలాలా
తుమ్మెదలాడే ఓలాలా
కుందిని దంచే నాతి దరువుకే
గాజులు పాడే ఓలాలా
గాజులు పాడే ఓలాలా
గంధం పూసే మెడలో తాళిని
కట్టేదెవరే ఇల్లాలా
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం
తొక్కిన ఘనుడే ఏలాలా
ఏలాలో ఏలాలా...
ఏలాలో ఏలాలా...
దివిటీల సుక్కల్లో
దివినేలు మామా...
సందమామా సందమామా
గగనాల రథమెక్కి
దిగివచ్చి దీవించు
సందమామా సందమామా
నోమీ నమ్మల్లాల్లో నోమన్నలాలో
సందమామా సందమామా
నోచే వారింటిలోన పూచే పున్నాలబంతి
సందమామా సందమామా...
ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరు తరముల నాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ల రాత్రి
ఆ మంచమే పెంచె నీ తాత వంశం
అరవై ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి
మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి
ఇరవై ఏళ్ల వాడు మీ రాముడైతే
పదహారేళ్ల పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ
పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే...
మా తాతయ్య పెళ్లికొడుకాయెనే
ఆనందమానందమాయెనే...
మా నాన్నమ్మ పెళ్లికూతురాయెనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి