2, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం పాట లిరిక్స్ - Intiperu Anuraagam Mudduperu Mamakaaram Song Lyrics in Telugu - Maghadeerudu (1986) Telugu Songs Lyrics















చిత్రం : మగధీరుడు (1986)
సంగీతం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం    
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం

వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
ఎదిరించని జానకి, నిదురించని ఊర్మిళ
తోడికోడళ్ళుగా ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా రామలక్ష్మణులుగా
కొండంత అండగా అన్నలు తోడుండగా

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

వయసులో చిన్నయినా మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
వయసులో చిన్నయినా మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
అమ్మగా నాన్నగా బిడ్డగా పాపగా
ఏ దేవకి కన్నా ఏ యశోద పెంచినా
గోకులాన వెలిసాడు గోపాలకృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఏ కొండల పుట్టినా ఏ కోనలపొంగినా
సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలి
సంసారమనే ఒక సాగరం
అన్నతమ్ములైనా ఆలుమగలకైనా 
ఈ బ్రతుకు ప్రయాగలో 
తప్పదులే సంగమం ఈ త్రివేణి సంగమం 

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం

వెలుగులోన నీడగా లేమిలోన కలిమిగా
అందరము ఒక్కటిగా కలిసినప్పుడు
ఎడబాటుల బాటలన్ని కూడలి కావా
ఎదచాటున ఆపేక్షలే పొంగి పొరలవా
మమకారం ఒక్కటే మానవతకు ఆధారం
ఈ సంగమాన్ని ఆపడం 
ఎవరి తరం..ఇంకెవ్వరి తరం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి