చిత్రం : దృశ్యం (2014)
సంగీతం : శర్రత్
సాహిత్యం : చంద్రబోస్
గానం : కార్తీక్
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాల
మెరుపులు మొదలైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
ఇంటి పేరు ఉల్లాసమే
సొంత వూరు సంతోషమే
కంటి నిండుగా కలలుండగా
చేరదంట కన్నీరే
అల్లరంత మా సంపదే
చెల్లదంట ఏ ఆపదే
తుళ్లి తుళ్లి పొంగెనంట ఆటాపాటా
అల్లిబిల్లి ఆకాశంలో
అమ్మ నాన్న అక్క చెల్లి
మల్లెపూల మబ్బులైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
అందమైన మా స్నేహమే
అల్లుకున్న ఓ హారమే
సుడిగాలికి చెడు జ్వాలకి
తెగిపోదు ఈ దారమే
గుడిలోని ఆ దైవమే
అడిగేను ఆతిథ్యమే
గుమ్మంలోనే వాలేనంట
దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్నీ
చిర్రుబుర్రు తాపాలన్నీ
వచ్చిపోయి ఉరుమైతే
ప్రతి చినుకు తేనెలే
బ్రతుకంతా తీపిలే
ప్రతి మలుపు మమతేలే
కథలెన్నో మాతో కదిలెనే
ప్రతి రోజు పండుగ రోజే
సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే
చిరునవ్వు పూస్తుంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి