15, ఫిబ్రవరి 2022, మంగళవారం

కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది పాట లిరిక్స్ - Kantichoopu Cheputhondhi Kontenavvu Song Lyrics in Telugu - Jeevitha Chakram (1971) Telugu Songs Lyrics















చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్-జైకిషన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల





కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...

ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఓ పిల్లాఆ...

కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా... ఒ పిల్లాఆ...

చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? 
కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా? 
ఒ పిల్లాఆ...




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి