11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు పాట లిరిక్స్ - Soggaade Chinni Naayana Okka Pittanaina Song Lyrics in Telugu - Aasthiparulu (1966) Telugu Songs Lyrics

















చిత్రం : ఆస్తిపరులు (1966)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : కొసరాజు 
గానం : పి.సుశీల 







సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

కట్టె తుపాకెత్తుకోని 
కట్ట మీద నడుస్తుంటే 
కాలుజారి పడ్డాడే సోగ్గాడు
కట్టె తుపాకెత్తుకోని 
కట్ట మీద నడుస్తుంటే 
కాలుజారి పడ్డాడే సోగ్గాడు
పగటివేషగాడల్లే 
పల్లెటూళ్ళు తిరుగుతుంటే 
కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్.. 
పడుసు పిల్ల ఫక్కుమంది.. హహహ..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

కళ్ళజోడు ఏసికోని 
గళ్ళకోటు తొడుక్కోని 
పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
కళ్ళజోడు ఏసికోని 
గళ్ళకోటు తొడుక్కోని 
పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు
చిట్టివలస వాగుకాడ 
పిట్ట తుర్రుమంటేనూ..
చిట్టివలస వాగుకాడ 
పిట్ట తుర్రుమంటేనూ.. 
బిక్కమొగమేసాడు 
సుక్కలెంక చూసాడూ..
బిక్కమొగమేసాడు 
సుక్కలెంక చూసాడూ..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..

మూతి మీసం గొరుక్కోని 
బోసి మొహం పెట్టుకోని 
యాట కోసం వచ్చాడే సోగ్గాడు
మూతి మీసం గొరుక్కోని 
బోసి మొహం పెట్టుకోని 
యాట కోసం వచ్చాడే సోగ్గాడు
బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే 
ఎర్రిమొహం ఏసాడు.. హోయ్.. 
మిర్రిమిర్రి చూసాడు.. హూ..హోయ్..

సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ
సోగ్గాడే చిన్నినాయన 
ఒక్క పిట్టనైన కొట్టలేడు 
సోగ్గాడూ సోగ్గాడు..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి