25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో పాట లిరిక్స్ - Enno Enno Santhoshalenno Enno Song Lyrics in Telugu - Tej I Love You (2018) Telugu Songs Lyrics




















చిత్రం : తేజ్ ఐలవ్యూ (2018)
సంగీతం : గోపీసుందర్  
సాహిత్యం : రాంబాబు గోసల
గానం : సింహ 








ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే
ఎన్నో ఎన్నో ఎన్నో ఉల్లాసాలే ఎన్నో
ఊపేస్తుంటే అందే అంబరమే 
మనసంతా తుళ్ళేనూ ప్రతిక్షణమూ హాయిగా 
ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా 
గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా 
ఈ ఆటల పాటల ఆనందాలా

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ
ఒకచోటే కలిసి మెలిసి సందడినే చేసేనా
చిలిపితనం చెలిమిగుణం చిరు జగడాలన్నీ
కనులెదుటే గంతులు వేసి గిలిగింతలు పెట్టేనా
సరదా దసరా రోజూ జరిగే బృందావనమిదిలే
దరికే రాదూ ఏ దిగులూ ఔనా 
అలుపు సొలుపు ఎపుడూ 
ఎరుగని అల్లరి చిందులివే 
అలకే లేదంటా ఎవ్వరిలోనా 

హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ
హాపీ హాపీ హాపీ హాపీ హాపీ ఫ్యామిలీ

ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలె ఎన్నో
ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే

అతిథులుగా దేవతలే దిగివస్తారేమో
ఇలపైనే స్వర్గంలాంటి ఈ ఇల్లే చూశాక 
శతమానం భవతంటూ దీవిస్తారేమో
ఈ అనుబంధాలే సాక్ష్యం తడికంటికి శలవిక
అమ్మా నాన్నను మరిపిస్తారే ఈ ఐనోళ్ళంతా
ఇంతకు మించిన వరముండదు అంటా
జన్మకు సరిపడు ప్రేమను పంచేవాళ్ళే చుట్టూతా
ప్రాణం ఇంకేమీ కోరదు అంటా 

1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ
1234 1234 హ్యాపీ ఫ్యామిలీ







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి