2, ఫిబ్రవరి 2022, బుధవారం

ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈ వేళ పాట లిరిక్స్ - Aakasamlo Oka Taara Naakosam Vacchindi Eevela Song Lyrics in Telugu - Simhasanam (1986) Telugu Songs Lyrics

















చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పీలహరి
సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి
గానం : రాజ్ సీతారామ్, పి.సుశీల 





జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం 
హే...హేహే..ఆ..ఆ...ఆహహా... 
లాలల లలలా ఆ...అ... 

ఆకాశంలో ఒక తారా... 
నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తారా... 
నాకోసమొచ్చింది ఈ వేళ

ఇలలో ఒక చందమామ... 
ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ... 
ఒడిలో పొంగింది ప్రేమ

తార జాబిలి కలవని నాడు... ఏ వెన్నెలా లేదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన

అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు

వాగు వంక కలవని నాడు ఏ వెల్లువ రాదులే

జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... 
నాకోసమొచ్చింది ఈ వేళ 

కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 

కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి

నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే

అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకోనా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన

అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన

కదిలే నీ ప్రాణశిల్పం... 
మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం... 
మదిలో కర్పూరదీపం

నింగి నేల కలిసినచోట... 
ఏ వెలుతురూ రాదులే

జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... 
నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు 
ఏ వెన్నెలా లేదులే

జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి