చిత్రం : వినయవిధేయరామ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : MLR కార్తికేయన్
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఏ తియ్యదనం మనసుపడి రాసిందో
ఎంతో అందంగా ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే
ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే
మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో
ఏ దిక్కున మొదలైనోళ్లో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలిపటాలో
ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఈ ఇంటిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడూ అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడి విడిగా వీళ్ళు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లె
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా
విడివిడిగా వీళ్ళు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా
తందానే తందానే తందానే తందానే
చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే
ఒకటే కలగంటాయంట వీళ్లందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి