చిత్రం : విశ్వరూపం (2013)
సంగీతం : శంకర్ ఎహ్‍సాన్ లాయ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్, కమల్‍హాసన్
అధినవనీతా అభినయ రాజా
గోకుల బాలా కోటి ప్రకాశా
విరహ నరక శ్రీ రక్షక మాలా
కమ్మని కలలను కదిపితె చాలా
కన్నియ కౌగిలి చేరగలేవా
ఊహల వాకిట ఉండకురా
కల వెన్నెల చిందు వరమ్మీరా
పూతన గర్వమణంచిన వాడా
పాపపు విరహము బలిగొన రారా
మనసుంటే మాయా వీరా రారా రారా
మనసుంటే మాయా వీరా రారా రారా
మనసుంటే మాయా వీరా రారా రారా
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
కృష్ణా ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తైనా మొరాలించవే
గుండె సడినాపి గుండె సడినాపి
గుండె సడినాపి గుండె సడినాపి
గమదనిసా నిదపమ గమ రిగరిస
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్నదొంగా మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
ధీం ధీం కిడతకధిన
నటన భావ శ్రుతిలయ గంగా
కిడ తక ధీం ధీం ధీన్నా
నిదురను నీకై త్యజించు
అనవరతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని
నీ రాధే నేనని రారాదా
ఎవ్వేళ నువ్విలా రివ్వందువోయని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్లంత కళ్లుగా వేచానొక్కోయుగం
వెల్లువల్లె రారా క్షణమాగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియా సుమం
ఓ... దొంగచాటు కౌగిలింతై... ఈ...
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవంచుల్లోన
కేరింతగా ఫలించూ
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే
తన్మయి నేనై తరించాలిరా
వదిలిపోని వలపై పైయ్యెదగ
హత్తుకోలేవా చెలిని చెలినీ
కన్నా తుడిచేసి నా నిదుర
విడిచి వెళ్లకంటున్నా కలని కలనీ...
ఇక ఈ జన్మలో..నా నువ్వు కనిపించులోనా
చెలి ప్రాణాలు పోతే ఎలా
అని కొరగాని ఆరాటమేలా ప్రియా
నువ్వె ఊపిరిగా జీవించనా
తకతకతకధిం తకతకధిం
తకతకధిం తకతకధిం
తకధిం తకధిం తోం తోం తకిటితోం
తకధిళాంగుతోం తోంకిటత
తక తరికట తక తరికట
తక తరికట తక తరికట
తక తరికట తక తరికట
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి