22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పాట లిరిక్స్ - Muthyaalu Vasthava Adigindhi Isthava Song Lyrics in Telugu - Manushulanthaa Okkate (1976) Telugu Songs Lyrics


















చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 







ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో

నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ

ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను
ఉన్నదంత ఇచ్చేసీ నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకునుంటానూ
అహా... ఒహో.. ఏహే.. ఏ..

ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో 

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి