చిత్రం : గౌరి (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే..
గలగల పారుతున్న గోదారిలా
అందాల పందిరి వేసే ఈ తోటలూ
ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులూ..
కడవలు మోసే కన్నెలూ
బంగరు పంటల సీమలూ..
చూడరా.. హే..
గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే..
గలగల పారుతున్న గోదారిలా
దేశానికాయువు పోసే ఈ పల్లెలూ
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే
న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే
జీవితం.. హే..
గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా.. హే..
గలగల పారుతున్న గోదారిలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి