26, ఫిబ్రవరి 2022, శనివారం

నాలో ఏదేదో అయిపోతున్నదే పాట లిరిక్స్ - Naalo Ededho Ayipothunnadhe Song Lyrics in Telugu - Manasicchi Choodu (1999) Telugu Songs Lyrics




















చిత్రం : మనసిచ్చి చూడు (1999)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత







నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి..
అంతే ఈ ప్రేమ వరసా 
దాని అంతే చూడాలి వయసా
ఈవేళ ఈ సూర్యోదయం 
ఇన్నాళ్ల లాగ లేదు కదా
నీలోన ఈ ప్రేమోత్సవం 
ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా
 
నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా

భాష మొత్తమూ మాయమైనదా 
గుండె మాట గొంతు దాటి రాదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
శ్వాస మాత్రమూ గేయమైనదా 
హాయి పాటలెన్నో మీటుతోందే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీలో ఏదో కొత్త కోణం చూశా 
నువ్వు నువ్వేనా కాళిదాసా
నీవే కదా నిండు ప్రాణం పోసి 
దీన్ని పెంచావు కన్నె హంస
ఒక్క మాటే అని కోటి భావాలని 
అందచెయ్యాలని కొత్త పాఠం ఇదే తెలుసా

నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా

కన్ను కొద్దిగా చిన్నదైనదా 
నిన్ను తప్ప ఏమీ చూడలేదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక 
కాలమంతా ఆగిపోయే ముందే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
ఏతా వాతా దీని వాటం చూస్తే 
తీయగా ఉన్న కత్తి కోత
ఇంటా బయటా మొగమాటం పెట్టే 
తప్పుకోలేని వింత వేటా
మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా
పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా

నాలో ఏదేదో అయిపోతున్నదే
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా
నీ తోడు కోరింది నా ఊపిరి..
అంతే ఈ ప్రేమ వరసా 
దాని అంతే చూడాలి వయసా
ఈవేళ ఈ సూర్యోదయం 
ఇన్నాళ్ల లాగ లేదు కాదా
నీలోన ఈ ప్రేమోత్సవం 
ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా
 
నాలో ఏదేదో అయిపోతున్నది
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా 
అంతే ఈ ప్రేమ వరస 
దాని అంతే చూడాలి వయసా 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి