2, ఫిబ్రవరి 2022, బుధవారం

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో పాట లిరిక్స్ - Chinuku Chinuku Andelatho Chitapata Chiru Savvaditho Song Lyrics in Telugu - Subhalagnam (1994) Telugu Songs Lyrics

చిత్రం : శుభలగ్నం(1994)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
 
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో

అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేస్తే బుగ్గ మీద ఏలో 

తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం 

ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

 వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
 
వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో 

మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
 
అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో

ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 

 సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  

 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి