15, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట పాట లిరిక్స్ - Aakasam Nunchi Meghaale Digi Vacchi Raagale Song Lyrics in Telugu - Mitrudu (2009) Telugu Songs Lyrics



















చిత్రం : మిత్రుడు (2009)
సంగీతం : మణిశర్మ
రచన : వెన్నెలకంటి
గానం : విజయ్ ఏసుదాస్ , కౌసల్య








ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే
చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే
 
కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య
 
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
 
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
ఆనందం అభిమానం మా తోట పువ్వులులే
అనురాగం అనుబంధం మా గూటి గువ్వలులే
 
సంతోషం సల్లాపం మా ఇంటి దివ్వెలులే
ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులులే
మా సాటి ఎవ్వరు మా పోటి లేరెవరు 
గుండెల చప్పుడు వింటుంటే కొండలు కోనలు పలికేనంట
పండిన మమతలు పలికెలే ఎండలు కూడా వెన్నెలలే 

కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట
హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట
 
ఆశలు ఎన్నో అందరిలోన వుంటాయిలే
కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే
ఊహలలోన ఎదలే ఊయల ఊగాలిలే
ఓ కధలాగ జీవితమంతా సాగలిలే
ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట
మా మనసుల మమత ఇక మాసి పోనే పోదంట 

కన్నె కుట్టి వచ్చాడులే అందాల మామయ్య
కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి