26, ఫిబ్రవరి 2022, శనివారం

డాడీ కథ వినవా చెబుతాను పాట లిరిక్స్ - Daddy Katha Vinavaa Chebuthaanu Song Lyrics in Telugu - Ugadi (1997) Telugu Songs Lyrics


















చిత్రం : ఉగాది (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : భువనచంద్ర 
గానం : ఉన్నికృష్ణన్, సునీత, మనో, శ్రీలేఖ  





డాడీ కథ వినవా చెబుతాను
బేబీ చెప్పేయవా వింటాను
నిన్న మొన్న నాకే తెలియక
సతమతమయ్యా డాడీ
అరె సిగ్గేసినా చెప్పేయనా ఆ మాటని

మమ్మీ నా ప్రేమ సొద వినవా
బాబు విననంటే వింటావా

తొలి తొలి చూపే తొలకరి వానై
స్పృశించింది డాడీ
అదో వింత హాయి మమ్మీ
నిన్నటిదాకా తెలియని ఊహలు
తలెత్తాయి డాడీ
నను మథించాయి మమ్మీ
పెదవులు దాటని పిలుపులు వింటూ
తరించాను డాడీ
నే తపించాను మమ్మీ
నిద్దుర పట్టదు ఆకలి పుట్టదు
ఒకటే గుబులే మమ్మీ
కలయో తెలియని నిజమో తెలియని
కలవరపాటే మమ్మీ
సాల్ట్ తీసుకుని టేస్ట్ చేసినా
స్వీటుగుందిలే డాడీ
ఆ తలపే ప్రేమ పిలుపే ప్రేమ గుబులే ప్రేమ

బాబూ వివరాలే చెప్పమ్మా
బేబీ బిడియాలే వద్దమ్మా

ముద్దుల పాపని మురిపెంగా 
తను పెంచినాడు మమ్మీ
ప్రాణం పంచినావు డాడీ
కోరినవన్నీ కాదనకిచ్చే 
దేవుడు తను మమ్మీ
ఐ లవ్యూ మై డాడీ
పిల్లల ఆశని వమ్ము చేయని 
పెద్ద మనసు తనది 
ఎంతో మంచి మనసు తనది
గురువు దైవం నేస్తం సర్వం
అతడే నాకు డాడీ
అంతటి మనిషికి అల్లుడినవటం 
లక్కీ లక్కీ లక్కీ
నువ్వు మెచ్చిన నీకు నచ్చిన 
యువకుడె అల్లుడు బేబీ
నీ మదిలో ఉన్న వాడే 
మాకు నచ్చేనమ్మా

బాబు సుముహూర్తం చూసేయనా
బేబీ లగ్నాలే పెట్టేయనా
పెళ్ళికొడుకునే చూడకుండ
ఈ అల్లరి ఏమిటి డాడీ
అరె నీ కళ్ళతో చూసాములే అబ్బాయిని
మమ్మీ అత్తవి ఐపోతావా
బేబీ మనవడినే ఇస్తావా







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి